ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా..18 వేల ఉద్యోగాలు

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో.. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న, ఇవాళ జాబ్ మేళా జరిగింది. రెండురోజుల్లో 60వేల మందికి పైగా నిరుద్యోగులు తరలివచ్చారు. 18వేల మంది ఉద్యోగాలు సాధించారు. ఓయూ బీటెక్ విద్యార్థికి.. ఫ్యాక్ట్ సెట్ అనే కంపెనీ 9 లక్షల ప్యాకేజ్ ఆఫర్ చేసింది. 

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటుచేసిన జాబ్ మేళాకు.. ఓయూ వైస్ చాన్సలర్ రవీందర్ హాజరయ్యారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే.. విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని వీసీ రవిందర్ సూచించారు . నిరుద్యోగాన్ని తగ్గించేందుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జాబ్ మేళా ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని విద్యార్థులు అన్నారు.