కేటీఆర్ కుటుంబం, 4కోట్ల ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నిక

మునుగోడు ఉప ఎన్నిక కేటీఆర్ కుటుంబానికి 4 కోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మాటలను జనం ఎవరూ నమ్మడం లేదని చెప్పారు. అధికారపార్టీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని రోజగోపాల్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. 

మునుగోడు ఉప ఎన్నిక పదవి కోసం వచ్చిన ఎన్నిక కాదని, ప్రజల తరరాత మార్చే ఎన్నిక అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇది పార్టీల మధ్య పోరు కాదని, ఆత్మగౌరవం కోసం వచ్చిన ఎన్నిక అని చెప్పారు. ఒక కుటుంబం చేతిలో చిక్కుకున్న తెలంగాణను రక్షించేందుకు, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికేందుకు బీజేపీకి ఓటేయాలని రాజగోపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.