నా ఊపిరి మునుగోడు ప్రజల కోసమే : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నా ఊపిరి మునుగోడు ప్రజల కోసమే : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు :  ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా నా ఊపిరి ఉన్నంతవరకు మునుగోడు ప్రజల కోసమే పాటుపడతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, వైస్ చైర్మన్ పోగుల వెంకట్ రెడ్డి, పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మునుగోడు ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తానని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్నారు. నన్ను నమ్ముకున్న నాయకులకు అన్యాయం చేయనని, కొన్ని సందర్భాల్లో అందరినీ సంతృప్తి పర్చలేమని, అర్థం చేసుకోవాలని కోరారు. 

16 నెలలుగా మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురుచూడడం బాధగా ఉందన్నారు. పనిచేసే వారికి పదవులు ఇస్తే ప్రజలు బాగుపడతారని తెలిపారు. మంత్రి పదవి వచ్చే సమయంలో జానారెడ్డి లెటర్ తో మళ్లీ మొదటికి వచ్చిందని, ఇక పదవి కోసం అడగడం మొదలు పెడతానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మంత్రి పదవి కావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.