మునుగోడు ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి తీన్మార్ స్టెప్పులు

మునుగోడు ఉపఎన్నిక దగ్గరపడుతున్న వేళ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంస్థాన్ నారాయణపూర్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి డ్యాన్స్ చేశారు. తీన్మార్ స్టెప్పులతో అందరినీ హుషారెత్తించారు. 

అంతకుముందు బోటిమీదతండాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బానిస బతుకులు కావాలంటే కారు గుర్తుకు.. ప్రజాస్వామ్యం కావాలంటే పువ్వు గుర్తుకు ఓటెయ్యాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో తాను రాజీనామా చేయడం వల్లే మంత్రి సత్యవతి రాథోడ్ తండాకు వచ్చారని చెప్పారు. స్థానికులు ఇల్లు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.