మునుగోడు ప్రజలు తలెత్తుకునేలా పనిచేస్త : రాజగోపాల్ రెడ్డి

తన జీవితం మునుగోడు అభివృద్ధికే అంకితమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని కలవలపల్లి, బీరెల్లి గూడెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ధర్మయుద్ధంలో బీజేపీకి ఓటేసి ధర్మాన్ని గెలిపించాలని కోరారు. కేసీఆర్ పెన్షన్లను తన ఇంట్లోకి నుంచి ఇవ్వడం లేదన్నారు. తనన గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే రాజీనామా చేశానని.. దొడ్డిదారిన బీజేపీలో చేరలేదని చెప్పారు. మునుగోడు ప్రజలు తలెత్తుకునేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు చౌటుప్పల్ మున్సిపాలిటీలో రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. మునుగోడు అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని..ప్రజలు అండగా నిలవాలని కోరారు.