- మునుగోడు అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌లో గాలి వీస్తోందని, సీఎం కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావడం ఖాయమని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం 9,10,11 వార్డుల్లో గడప గడపకు తిరుగుతూ ఆరు గ్యారంటీ పథకాలను వివరించారు. వర్షం పడుతున్నా అలాగే ప్రచారం నిర్వహించి.. చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పదేళ్లలో అబద్ధపు హామీలు మాయమాటలతోనే ప్రజలను మభ్యపెట్టాడని విమర్శించాడు. ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మునుగోడు ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.