మునుగోడు,( చండూరు) / చౌటుప్పల్ , వెలుగు : కేసీఆర్ నియంతృత్వ కుటుంబ పాలనను అంతం చేసి, బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తున్నామని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన క్యాంప్ ఆఫీస్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో ఆందోల్ మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ఆయా సమావేశాల్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.
కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాటడమే తన లక్ష్యమన్నారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితను బీజేపీ ప్రభుత్వం జైల్లో పెట్టకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనుకొనే పరిస్థితి వచ్చిందని, అందుకే కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చినట్టు తెలిపారు. తెలంగాణ ప్రజలకు 15 ఏండ్ల తర్వాత మంచి రోజులు వస్తున్నాయని, ఓడిపోతారనే కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, కోయ్యడ సైదులు, ఉబ్బు వెంకటయ్య పాల్గొన్నారు.
ALSO READ :ఎమ్మెల్యే ఇచ్చే మందు డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయండి : ఉత్తమ్ కుమార్ రెడ్డి