కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేటీఆర్ అహంకారాన్ని దింపేస్తం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్,  వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహంకారాన్ని ఈ ఎన్నికల్లో దింపేస్తామని కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.  మంగళవారం చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెంలో నిర్వహించిన ప్రజా దీవెన సభలో ఆయన మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలయ్యిందని విమర్శించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోరాటం చేసేందుకు బీజేపీలో చేరానని,  లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కామ్‌‌‌‌‌‌‌‌ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడంతో  బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఒక్కటేనని అర్థమైందన్నారు. అందుకే తిరిగి సొంతగూటికి వచ్చానని స్పష్టం చేశారు.

తన రీఎంట్రీతో ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు గజగజ వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వబోమని సవాల్ చేశారు.  దళిత సీఎం, మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కొత్త హామీలతో ఓట్లడుగుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణ  ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, అందరూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటేయాలని కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు అమలు చేయడంతో పాటు మునుగోడును సిద్దిపేట, సిరిసిల్లను దీటుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.