కేసీఆర్, బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కుటుంబ పాలనకు, నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నైతిక విజయం తనదేని చెబుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని చెప్పారు. ఇచ్చిన హామీలను గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ మర్చిపోయారని అన్నారు.  కేవలం ఓటు బ్యాంకు కోసం పెన్షన్లు, రైతుబంధు పథకాలు అందిస్తున్నారని అన్నారు. కోదాడ పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ పార్టీ పేరులో తెలంగాణ పదం తీసి.. బీఆర్ఎస్ పేరు పెట్టి తన గుంత తానే తీసుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని తుగ్లక్ మాదిరిగా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్.. తన కుటుంబం, తన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి అని, తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.