పని చేసేటోళ్లకు ఓటేస్తరా.. పట్టించుకోని వాళ్లకా ? : రాజగోపాల్ రెడ్డి

బానిస బతుకులు కావాలంటే కారు గుర్తుకు.. ప్రజాస్వామ్యం కావాలంటే పువ్వు గుర్తుకు ఓటెయ్యాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని బోటిమీదతండాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను రాజీనామా చేయడం వల్లే మంత్రి సత్యవతి రాథోడ్ తండాకు వచ్చిందని చెప్పారు. స్థానిక ప్రజలు ఇల్లు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. 

టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో బోటిమీదతండాలో సరైనా రోడ్డు కూడా లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ప్రజల కోసం కొట్లాడేటోళ్లకు ఓటేస్తారా.. పట్టించుకోని వాళ్లకు ఓటేస్తారా అని ప్రశ్నించారు. పోడుభూములకు పట్టాలిస్తామని మాయమాటలు చెప్పి చివరికి ఆ భూములనే గుంజుకుంటున్నారని ఆరోపించారు. మీ పిల్లల భవిషత్తు బాగుండాలంటే కమలానికి ఓటెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.