యాదాద్రి భువనగిరి జిల్లా : గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెల్చిన 12 మంది ఎమ్మెల్యేలను గంపగుత్తగా కొన్నదెవరని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. డజను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని.. ప్రతిపక్షం లేకుండా చేయడం ద్వారా కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్ మండలం పుట్టపాక లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
‘‘మూడున్నర ఏళ్లు నేను అసెంబ్లీలో మాట్లాడాను. మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ ప్రభుత్వానికి చెప్పాను. ఒక్క మాట కూడా వినలే.. ఒక్క రూపాయి కూడా ఇయ్యలె. మరి ఈ ప్రభుత్వం ఎవరి కోసం ?’’ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు సీఎం కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో భయపడి ఇంట్లో కూర్చోవాల్నా ? రాజీనామా చేసి పోరాటం చేయాల్నా?’’ అని ప్రజలను అడిగారు. ప్రజల అభీష్టం మేరకు తాను కేసీఆర్ సర్కారుపై పోరాటానికి దిగానని, అందుకే ఈ ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు.