గట్టుప్పల్ (చండూరు) వెలుగు: గ్రామాల్లో బెల్టు షాపుల మూసివేత నిర్ణయాన్ని తీసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ బుధవారం గట్టుపల్ మండల కేంద్రంలో సర్పంచ్ ఇడం రోజా మహిళలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. బెల్ట్ షాపుల వల్ల గల్లి గల్లి కి మందు దొరకడంతో, మద్యానికి బానిసలుగా మారి కుటుంబాల ఆగమవుతున్నాయని బెల్ట్ షాపులు లేకుండా చేయాలని గ్రామపంచాయతీ
పాలకవర్గం ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి బెల్ట్ షాపులకునోటీసులు అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు.కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఇడం కైలాసం, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బీమగాని మల్లేశ్,పగిళ్ళ ఆది, మహేశ్, మాజీసర్పంచ్ పోరెడ్ది ముత్తిరెడ్డి, కారింగు వెంకటమ్మ, చరిపల్లి విజయలక్ష్మీ, అంజమ్మ, భారతమ్మ పాల్గొన్నారు.