నూతన గృహ ప్రవేశం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లాలోని మునుగోడు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు నూతన గృహ ప్రవేశం చేశారు. కొత్తగా నిర్మించిన గృహంలో శాస్త్రోక్తంగా హోమం పూజలు నిర్వహించారు. నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడానికి మునుగోడులో కొత్త ఇంటిని నిర్మించుకున్న రాజగోపాల్ రెడ్డి.. అందులోని తన కార్యాలయంలో ప్రతి రోజు వెయ్యి మంది భోజనం చేసే విధంగా విశాలమైన కిచెన్ ను నిర్మించడం విశేషం.