తెలంగాణ వచ్చాక ఒక్క కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. కేసీఆర్ చేతిలో తెలంగాణ చిక్కుకుపోయిందని ఆరోపించారు. ప్రజల బతుకులు బాగుపడాలన్న పేదోళ్ల కష్టాలు పోవాలన్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్న కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పారు.
రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని చెప్పారు కానీ కేసీఆర్ పాలనలో అవేమీ రాలేదన్నారు రాజ్ గోపాల్. కాంగ్రెస్ కు ఓటేస్తే మీ జీవితాలు బాగుపడతాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ గాలి విస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 9 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మునుగోడును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.