రైతులకు ఉచిత విద్యుత్ పై మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లకు సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. 24 గంటలు కాదు 20 గంటలిచ్చినట్లు రుజువు చేసినా తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 15 గంటల కరెంట్ ఇచ్చినట్లు నిరూపించినా కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు.
సీఎం కేసీఆర్ ను నమ్మే రోజులు పోయాయని..అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనన్నారు వెంకట్ రెడ్డి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే దళితబంధు, బీసీ బంధు అని తెరపైకి తెచ్చారని.. బంద్ పథకాలన్నీ కేసీఆర్ దుకాణం బంద్ చేయడానికే అని సెటైర్ వేశారు. హోం గార్డ్ రవీందర్ ది హాత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్య అని ఆరోపించారు.
ALSO READ : షారుఖ్ వన్ మ్యాన్ షో.. జవాన్పై బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చిన మహేష్
సెప్టెంబర్ 17 న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కర్నాటకలో ఇచ్చే5 కొత్త పథకాలు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేత చెప్పిస్తామన్నారు. 400 కోట్ల ప్రజలు బాగుపడుతారని తెలంగాణ ఇస్తే కేవలం 4 కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నారు.