మంత్రి కేటీఆర్ పిట్టకథలు చెప్పడంలో దిట్ట : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంత్రి కేటీఆర్ పిట్టకథలు చెప్పడంలో దిట్ట అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ప్రగతిభవన్ ను  ఖాళీ చేసే రోజులు దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు.  నార్కట్పల్లి వివేర హోటల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి  కోమటిరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పలువురు  వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు.  

బీఆర్ఎస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి కాపీ కొట్టిందని విమర్శించారు.   కాంగ్రెస్  ప్రకటించిన  హామీలకు కొంత అమౌంట్ పెంచి  ప్రకటించారన్నారు.  బీఆర్ఎస్ మేనిఫెస్టోను  తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరున్నారు. కేసీఆర్ కుటుంబం..  రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకుందని, ఆ డబ్బునే రేపు ఎన్నికల్లో ఖర్చు చేస్తోందని కోమటిరెడ్డిఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్లు ఇచ్చిన డబ్బులను తీసుకోవాలని  ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని చెప్పారు.  

నకిరేకల్ లో 60 వేల మెజారిటీతో వేముల వీరేశంను  గెలిపించాలని కోరారు.  పార్టీకోసం,  వీరేశం గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.  సోనియా గాంధీ నాయకత్వంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి తీరుతుందని హామీ ఇచ్చారు.