కొండమడుగు గ్రామస్తుల దీక్షకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంఘీభావం 

  • 6వ రోజు కొనసాగుతున్న కొండమడుగు గ్రామస్తుల  దీక్షలు

యాదాద్రి  భువనగిరి జిల్లా: రసాయన పరిశ్రమను తరలించాలని కొండమడుగు గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆరో రోజు కొనసాగుతోంది. వీరి నిరసనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఉదయం శిబిరానికి వచ్చిన ఆయన గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు.

యాదాద్రి భువనగరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం వద్ద చందక్ లాబరేటరీ రసాయన పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఆస్ట్రేలియా వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవలే తిరిగి వచ్చారు. తాజాగా కొండమడుగు గ్రామస్థుల దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. కంపెనీ తమ మిషనరీని తొలగించాల్సిందేనని డిమాండ్ చేసిన వెంకట్ రెడ్డి.. కంపెనీ యాజమాన్యానికి రేపు ఉదయం 10 గంటల వరకు సమయం ఇచ్చారు.