కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన భూములను టిఆర్ఎస్ గుంజుకుంటుందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పెద్ద అంబర్ పేట్ కుంట్లూర్ లోని సర్వే నంబర్ 101, 106లో దళితులు నిర్మించుకున్న నిర్మాణాలను రెవిన్యూ అధికారులు కూల్చి వేశారు. దీంతో బాధితులు నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తో కలిసి కోమటిరెడ్డి మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దళితులకు విలువైన భూములు ఇస్తే టిఆర్ఎస్ ఆ భూములను గుంజుకునే పనిలో పడిందన్నారు. దళితులు ఆర్థికంగా విలువైన భూముల్లో ఉంటే టిఆర్ఎస్ సర్కార్ కళ్లుమండి.. భూములను గుంజుకుందన్నారు. దళితుల జోలికొస్తే ఊరుకోమన్నారు నేతలు.
స్టూడెంట్లకు పురుగుల అన్నం పెడుతున్రు
కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతుంది
పదేండ్ల V6 జర్నీ