కాంగ్రెస్ గెలిస్తేనే ప్రభుత్వం ఒళ్లు దగ్గరపెట్టుకుంటుంది : కోమటిరెడ్డి

కాంగ్రెస్ గెలిస్తేనే ప్రభుత్వం ఒళ్లు దగ్గరపెట్టుకుంటుంది : కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి : ఇంటర్ పరీక్షల సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల 10 లక్షల మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారన్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శుక్రవారం ఆయన పోచంపల్లిలో మాట్లాడారు. నాలుగు ఏండ్లు ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరని వేడుకున్నారు. హైద్రాబాద్ నుండి వచ్చే మూసి నీటి శుద్ధి చేయడానికి నదిపై ట్రీట్మెంట్ ప్లాంట్ లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. రెండు రాజధానుల మధ్య సులభమైన రవాణాకు హైదరాబాద్ నుండి సూర్యాపేట మీదుగా అమరావతికి రైలు మార్గం తీసుకొస్తానని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.