హైదరాబాద్, వెలుగు : వైద్యరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు వారందరికీ గర్వకారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని మంత్రి సన్మానించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ .. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో నాగేశ్వర్ రెడ్డి చేసినన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు మరో డాక్టర్ చేయలేదన్నారు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రాణం పోస్తున్నాయని గుర్తుచేశారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు సైతం తన పరిశోధనలతో పునర్జన్మను ప్రసాదిస్తున్నారని ప్రశంసించారు.