భువనగిరిలో రూ.100 కోట్లతో స్టేడియం నిర్మిస్తామన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. భువనగిరి ఖిల్లా రోప్ వే పనులకు తొందరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. బస్వాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం పరిశీలనలో ఉందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ యాదాద్రి క్షేత్రం విషయంలో సొంత ఎమ్మెల్యే అభిప్రాయం కూడా తీసుకోలేదన్నారు. త్వరలో దేవాదాయ శాఖ మంత్రిని తీసుకొచ్చి యాదాద్రి అభివృద్ధి పై సమీక్ష చేస్తామన్నారు.
తమ ముఖ్యమంత్రి అన్నట్టుగా మీ బీఆర్ఎస్ పార్టీని తాము బరాబర్ బొంద పెడతామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ 14 ముక్కలవుతుందన్నారు. గత ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రజల భూములు గుంజుకుందన్నారు. గొర్లు, బర్లు, బతుకమ్మ చీరలు తప్ప ఏమి చేయలేదన్నారు. కేటీఆర్ అధికారం పోయిన షాక్ లో పిచిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు .బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అము చేయొచ్చన్నారు. గృహాలకు ఉచిత కరెంట్ విషయంలో కేటీఆర్ ఆలోచించి మాట్లాడాలన్నారు.