తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన అంతం కావాలంటే మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ ను గద్దె దింపాలంటే ప్రధాని మోడీ, అమిత్ షా ల తోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల పేరు మీద వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. తన రాజీనామా తో ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ను మునుగోడు కు రప్పించానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ముఖ్యమత్రి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తనను రాజకీయం గా ఎదుర్కొలేక టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రిజైన్ చేయడంతో ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ను మునుగోడుకు రప్పించానని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన దాదాపు 500 మంది కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వాంరదరికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బందు పథకం పెట్టారు,మునుగోడు ఉప ఎన్నిక కు గిరిజన బందు పథకం తెస్తున్నారు. 1400 యువకుల ఆత్మబలిదానాల తో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ కుటుంబం రాజకీయ పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.