అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ నియోజకవర్గానికి ఆరు అప్లికేషన్లు వచ్చాయని.. అవసరమైతే తన సీటను బీసీలకు ఇస్తానని చెప్పారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీసీలకు సీటు ఇవ్వాలన్నారు. ఇవాళ(ఆగస్టు 29న) అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేయొద్దని సమావేశంలో చెప్పినట్లు తెలిపారు.
మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పానన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డిక్లరేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు. నాలుగైదురోజుల్లో మరోసారి సమావేశం అవుతామని.. సర్వే ఆధారంగా స్క్రీనింగ్ కమిటీలో చర్చించి సీట్లు ఖరారు చేస్తామన్నారు. బీఆర్ఎస్ లా కాకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగిలే టికెట్లు కేటాయిస్తామన్నారు. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అవుతుందన్నారు.