కేసీఆర్ ఒక్కడివల్లే తెలంగాణ రాలేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి: యాదాద్రిలో లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు భువనగిరి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  భువనగిరి నుంచి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు టికెట్ కేటాయించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. యాదాద్రి నరసింహస్వామి ఆశీస్సులు తీసుకుని ప్రచారానికి శ్రీకారం చుట్టానననీ.. ఈనెల 22న నామినేషన్ వేస్తానని చెప్పారు.

ఈ ఎన్నికలు మోడీ-రాహుల్ మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ఒక్కడివల్లే తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని తన కుటుంబంలా భావించి అండగా ఉంటానని చెప్పారు.