కొమ్మాలలో ప్రారంభమైన జాతర

ఆత్మకూరు (గీసుగొండ), వెలుగు : వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర హోలీ పండుగను పురస్కరించుకొని వైభవంగా  ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు అల్లం బాలకిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండిని సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్​రెడ్డి ప్రారంభించారు.

పలు పార్టీల నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ పార్టీ జెండాలతోనే ప్రభ బండ్లు, డీజే సౌండ్స్ తో జాతరకు తరలివచ్చారు. గిర్నిబావి నుంచి కొమ్మాల ఆర్చ్ వరకు నర్సంపేట ప్రధాన రహదారి రద్దీగా మారింది. గీసుగొండ, మామునూరు, పర్వతగిరి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ నెల 29 న రథోత్సవంతో జాతర ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు.