
జనగామ, వెలుగు : జనగామ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని గురువారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు.
జనగామ నియోజకవర్గంలో డెవలప్ మెంట్ పనుల కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ 10 కోట్లు, జనగామ మున్సిపాలిటీకి రూ 25 కోట్లు, చేర్యాల మున్సిపాలిటీకి రూ 10 కోట్ల నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.