
- జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి
చేర్యాల, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికులకే ఓటు వేసి గెలిపించాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మద్దూరు మండల కేంద్రంలోని తాజ్ ఫంక్షన్హాల్లో జరిగిన ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక నేతలకే ఓటు వేసి గెలిపించాలని, స్థానికేతరులకు ఓటు వేస్తే జనగామ దోపిడీకి గురవుతుందన్నారు. ఎవరు అభివృద్ధి చేస్తారు.. ఎవరు దోపిడీ చేస్తారో గమనించి ప్రజలు ఓటును వేయాలని సూచించారు. ఉమ్మడి మద్దూరు మండలంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు దళితబంధు పేరుతో డబ్బులు వసూళ్లు చేశారని ఆరోపించారు.
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు లభించాయని, నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ సెంటిమెంటుతో ప్రజలను ఆగం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో మద్దూరు జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, రాకేశ్ రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.