జనగామ అర్బన్, వెలుగు: పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్‌జిల్లా ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 14 పార్లమెంట్స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ అరవింద్‌తో పాటు సుమారు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, శివరాజ్, వంగాల కల్యాణి, వంగాల మల్లారెడ్డి, మేడ శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, ఉమాపతి రెడ్డి, బడికె కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.