
చేర్యాల, వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దొంగ ఓట్లతో గెలిచాడని జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని, ముందస్తుగా పల్లా ఇతర ప్రాంతాల నుంచి 16వేల దొంగ ఓట్లను వేయించుకొని గెలిచాడని విమర్శించారు. అందుకే అతడిని అందరూ దొంగఓట్ల ఎమ్మెల్యే అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా కొమురవెల్లి టెంపుల్మాజీ చైర్మన్ఆడెపు చంద్రయ్య, 5వ వార్డు కౌన్సిలర్నరేందర్, పద్మశాలీ యువజన సంఘం మండల అధ్యక్షుడు మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వెంకటేశం ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజలింగం, జనగామ జిల్లా యూత్కాంగ్రెస్అధ్యక్షుడు శివరాజ్, పీఏసీఎస్ డైరెక్టర్రవి, పట్టణ కాంగ్రెస్అధ్యక్షుడు చిరంజీవులు, ఆగంరెడ్డి, శివశంకర్‌గౌడ్, మల్లేశం, యాదగిరి, రఘువీర్, టెంపుల్కమిటీ డైరెక్టర్లు సంతోష్‌రెడ్డి, బాలరాజు, వినీత్, మహేందర్, వీరేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.