హైదరాబాద్, వెలుగు : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పునరుద్ధరించిన హైదరాబాద్‌లోని కొంపల్లి షోరూమును శనివారం తిరిగి ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ , కార్పొరేటర్, నగర ప్రముఖులు, మలబార్ మేనేజ్‌మెంట్ టీం సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ షోరూమ్‌ను అత్యంత ఆధునికంగా, అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని సంస్థ తెలిపింది. కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందిస్తుందని పేర్కొంది.
సరసమైన ధరలతో, సహేతుకమైన తరుగు చార్జీలతో ఆభరణాలు అందిస్తామని తెలిపింది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, విలువైన రత్నాలు, వెండి, ప్లాటినంతో తయారైన పెళ్లి ఆభరణాలు, సంప్రదాయ ఆభరణాలు, రోజువారీ ధరించే నగలను ఇక్కడ కొనొచ్చు. 'మైన్' డైమండ్ జ్యూయలరీ, 'ఎరా' అన్‌కట్ డైమండ్ జ్యూయలరీ, 'డివైన్' ఇండియన్ హెరిటేజ్ జ్యూయలరీ, 'ఎథ్నిక్స్' హ్యాండ్‌క్రాఫ్టెడ్ జ్యూయలరీ, 'ప్రీసియా' నగలను కూడా కొనుక్కోవచ్చు.