
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఐదో ఆదివారం సందర్భంగా శని, ఆది, సోమవారం రోజుల బుకింగ్ రూ.56,03,330 వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. మల్లికార్జునస్వామికి భక్తులు వివిధ రకాల మొక్కుబడులు, దర్శనాలు, లడ్డుప్రసాదం, పట్నాలు, బోనాలు, టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.