
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ.కోటి 39 లక్షలు వచ్చింది. గురువారం ఆలయంలో ఈఓ బాలాజీ, టెంపుల్ చైర్మన్ పర్పటకం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హుండీలను లెక్కించారు.
45 రోజుల్లో మల్లన్నకు భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు రూ..1, 39, 77, 230 క్యాష్, మిశ్రమ బంగారం 68 గ్రాములు, వెండి 14 కిలోల 800 గ్రాములు, 15 విదేశీ కరెన్సీ నోట్లు, 2500 కిలోల బియ్యం వచ్చింది. ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఏఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్నీల శేఖర్, ధర్మకర్తలు తాళ్లపల్లి రమేశ్, మేడికుంట శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.