
= ముగిసిన మహా ఘట్టం
= ఒక్కసారిగా భక్తులు రావటంతో తోపులాట
= పోలీసుల లాఠీచార్జ్
= ముగ్గురికి గాయాలు
సిద్దిపేట: కొమురవెల్లి మలన్న జాతరలో భాగంగా మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని తోటబావి కల్యాణ వేదిక వద్ద పెద్దపట్నం కార్యక్రమం ముగిసింది. ఒగ్గు పూజారులు పంచ రంగుల చూర్ణం (పొడి) తో అందంగా పట్నం వేస్తారు.
ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పెద్దపట్నం వద్ద నిలిపి పూజల అనంతరం అర్చకులు పెద్దపట్నాన్ని దాటుతారు. ఆ తర్వాత భక్తులు వెళ్తారు. ఈ క్రమంలో నాలుగు వైపుల గ్యాలరీలపై ఒక్కసారిగా భక్తులు రావటంతో తోపులాట జరిగింది.
పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసులు భక్తులపై స్వల్ప లాఠీ చార్జ్చేశారు. తోపులాటులో ముగ్గురికి గాయాలయ్యాయి.