ఇవాళ కొమురవెల్లి మల్లన్న కల్యాణం

ఇవాళ కొమురవెల్లి మల్లన్న కల్యాణం

ఇవాళ కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి కల్యాణం జరగనుంది. రాష్ట్రమంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.స్వామివారి కల్యాణోత్సవానికి మంత్రి హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి కూడా పాల్గొంటారు. కొమురవెల్లి మల్లన్న స్వామికి కిలోన్నర బంగారు కిరీటాన్ని మంత్రి హరీష్ రావు అలంకరించనున్నారు. 

పట్నాల మండపం, లడ్డూ ప్రసాద కౌంటర్, బుకింగ్ కార్యాలయాలను మంత్రులు ప్రారంభిస్తారు. ఇక కల్యాణోత్సవానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కూర్చొవడానికి చైర్లు, పందిర్లు ఏర్పాటు చేసి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు బందోబస్తు పెట్టారు.