కొమురవెల్లి మల్లన్న మూలవిరాట్ దర్శనం నిలిపివేత...

కొమురవెల్లి మల్లన్న మూలవిరాట్ దర్శనం నిలిపివేత...

సిద్దిపేటఫ జనవరి 7న జరుగనున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి మూలవిరాట్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ అధికారులు, అర్చకులు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే స్వామివారి కల్యాణం పురస్కరించుకుని... వారం రోజుల ముందు స్వామివారికి రంగులు అద్ది సుందరీకరణలో భాగంగా మూలవిరాట్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేసి.. ఉత్సవ విగ్రహాలతో భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. జనవరి 7న ఉదయం దృష్టి కుంభం అనంతరం స్వామివారికి ఛత్రకన్ను అమర్చిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.