
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న కల్యాణం సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కొమురవెల్లిలోని అన్నదాన సత్రం నుంచి మల్లన్న గుట్ట చుట్టూ స్వామివారి రథం తిరుగుతుండగా ఒక్కసారిగా రథం చక్రంపైన ఉండే ఇనుప పట్టి ఊడిపోయింది. గమనించిన ఆలయ అధికారులు ఊడిన ఇనుప పట్టిని మళ్లీ చక్రానికి బిగించి రథోత్సవాన్ని ముందుకు కొనసాగించారు.