
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.69,11,633 వచ్చినట్లు శుక్రవారం ఆలయ ఈవో రామాంజనేయులు, మెదక్ డివిజన్ ఇన్స్పెక్టర్రంగారావు తెలిపారు. 15 రోజుల హుండీలు లెక్కించగా నగదుతో పాటు మిశ్రమ బంగారం 46 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోల 200 గ్రాములు, 14 విదేశీ కరెన్సీ నోట్లు, 15 క్వింటాళ్ల బియ్యం వచ్చినట్లు పేర్కొన్నారు.
నగదును స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ చేసినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపులో శ్రీ లలితా సేవా ట్రస్ట్ కు సంబంధించిన 150 మంది మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు వలాద్రి అంజిరెడ్డి, అల్లం శ్రీనివాస్, లింగపల్లి శ్రీనివాస్, కాయిత మోహన్ రెడ్డి, చిగిరి కొమురయ్య, పర్యవేక్షకుడు శ్రీరాములు, సురేందర్, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, టీజీబీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.