డిసెంబర్ 22 నుంచి మల్లన్న స్వామి దర్శనం నిలిపివేత

డిసెంబర్ 22 నుంచి మల్లన్న స్వామి దర్శనం నిలిపివేత

కొమురవెల్లి, వెలుగు: ఈ నెల 22 నుంచి 29 వరకు కొమురవెల్లి మల్లన్న మూల విరాట్​దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో బాలాజీ బుధవారం తెలిపారు. స్వామివారు, అమ్మవార్ల విగ్రహాలకు పంచరంగుల అలంకరణ కోసం దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 

ఈ రోజుల్లో కేవలం ఉత్సవ మూర్తుల దర్శనం మాత్రమే ఉంటుందని చెప్పారు. తిరిగి 29 నుంచి పున దర్శనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.