కొమరవెల్లిలో వివిధ దుకాణాలకు వేలంపాట

కొమరవెల్లిలో వివిధ దుకాణాలకు వేలంపాట
  • సరైన ధర రాలేదని కొన్నింటిని వాయిదా వేసిన అధికారులు 
  • రెండు దుకాణాలకు రూ. 13 లక్షలకు పైగా ఆదాయం

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో  బహిరంగ వేలం పాటల  ద్వారా రూ. 13. 05 లక్షల ఆదాయం వచ్చింది. సోమవారం కొమురవెల్లిలో ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. పూజ సామగ్రి అమ్ముకునే  దుకాణాన్నిరూ.7 లక్షలకు ఎక్కువ పాట పాడి కొమురవెల్లికి చెందిన జి. దశరథం దక్కించుకున్నారు.

ఏప్రిల్ 1 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31, 2026 వరకు పూజా సామగ్రి అమ్ముకోవచ్చు. రెండో దుకాణం కే. శ్రీనివాస్ రూ. 6.5 లక్షలకు దక్కించుకున్నారు. సెల్ ఫోన్స్ భద్రపరిచే లైసెన్స్‌,  షాపింగ్ కాంప్లెక్స్ టెండర్లకు సరైన బిడ్​ రాలేదని అధికారులు వాయిదావేశారు.