కొమురవెల్లి మల్లన్నకు రూ. కోటి 11 లక్షల ఆదాయం

కొమురవెల్లి మల్లన్నకు రూ. కోటి 11 లక్షల ఆదాయం

కొమురవెల్లి, వెలుగు:  ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీని లెక్కించగా  రూ. కోటి11 లక్షల ఆదాయం వచ్చింది. ఆలయంలోని ముఖ మండపంలో ఈఓ రామాంజనేయులు, మెదక్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆలయ హుండీలను లెక్కించారు. 21 రోజుల్లో భక్తులు  సమర్పించిన నగదు, బంగారు, వెండి అభరణాలతో పాటు విదేశీ కరెన్సీ గా వచ్చిన నగదు రూ.1,11,96 ,965, కాగా మిశ్రమ బంగారం 112 గ్రాములు, మిశ్రమ వెండి 9.200 కిలో గ్రాములు, 24 విదేశీ కరెన్సీ నోట్లు, 20 క్వింటాలు బియ్యం వచ్చాయి. 

హుండీ నగదును స్థానిక బ్యాంకులో జమ చేశారు. లెక్కింపులో శివరామ కృష్ణ భజన మండలి సేవ సభ్యులు 150 మంది మహిళలు పాల్గొన్నారు. ధర్మకర్తలు కొప్పరపు జయ ప్రకాశ్ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్ , మామిడాల లక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, టీజీబీ బ్యాంకు సిబ్బంది ఉన్నారు. 

రామప్ప ఆలయానికి రూ. 4.47 లక్షల రాబడి

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీలను శుక్రవారం లెక్కించారు. నోట్ల ద్వారా రూ. 4,07,670 నాణేలుగా రూ. 40,114 కలిపి రూ. 4,47,784 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. పరిశీలకులు కవిత, ఆలయ అర్చకులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది,సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.