
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ హుండీలను శనివారం లెక్కించారు. 15 రోజుల్లో హుండీల ద్వారా ఆలయానికి రూ. 61,89,123 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు. అలాగే హుండీలలో 23 విదేశీ కరెన్సీ నోట్లు, 75 గ్రాముల బంగారం, 6.400 కిలోల వెండి
12 క్వింటాళ్ల బియ్యం వచ్చాయని ఈవో బాలాజీ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి ఏసీ.శివరాజ్, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు పాల్గొన్నారు.