
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో ఆదివారం ఆదాయం రూ.43,76,829 వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. శనివారం రూ.4,77,648, ఆదివారం రూ.34,98,777, సోమవారం రూ.4,00,404 ఆదాయం వచ్చిందన్నారు.
స్వామివారికి భక్తులు వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, ప్రసాదం, పట్నాలు, బోనాలు, టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఆలయ బుకింగ్ ఇన్‌చార్జి అధికారి నర్సింహులు తెలిపారు.