కొమురవెల్లి పుణ్యక్షేత్రం..రైల్వేస్టేషన్‌‌‌‌గా నామకరణం

కొమురవెల్లి పుణ్యక్షేత్రం..రైల్వేస్టేషన్‌‌‌‌గా నామకరణం

 కొమురవెల్లి, వెలుగు: మనోహరాబాద్–-హైదరాబాద్ రైల్వే మార్గంలో భాగంగా కొమురవెల్లి వద్ద ఏర్పాటు చేసిన రైల్వే జంక్షన్ కు కొమురవెల్లి పుణ్యక్షేత్రం అని నామకరణం చేసినట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మనోహరాబాద్–కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వరకు వేసిన రైల్వే లైన్ లో ఈ ప్రాంతాలకు సంబంధించి వచ్చే స్టేషన్లకు సంబంధించి గుర్రాల గొంది, చిన్న లింగాపూర్, సిరిసిల్ల పేర్లను ఖరారు చేశారు. కాగా కొమురవెల్లి రైల్వే జంక్షన్ కు మాత్రం కొమురవెల్లి పుణ్యక్షేత్రంగా పేరుపెట్టడంపై పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.