
కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక మల్లన్న నామస్మరణతో మారుమోగింది.
ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వామివారికి బంగారు పుస్తె మట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ వేడుకతో మూడు నెలల జాతర బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. సుమారు 30 వేలకు పైగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తుల దర్శనానికి దాదాపు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. -
కొమురవెల్లి, వెలుగు