మరుగుదొడ్ల అవినీతిపై ఎంక్వైరీ చేయాలె : ​కొమురవెల్లి శ్రీధర్​

దహెగాం, వెలుగు: దహెగాం మండలం కొంచవెల్లిలో నిర్మించిన మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులో అవినీతి జరిగిందని బీజేపీ లీడర్​కొమురవెల్లి శ్రీధర్​ఆరోపించారు. వెంటనే ఎంక్వైరీ చేయాలని కోరారు. శుక్రవారం దహెగాం ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛభారత్​కింద కొంచవెల్లి గ్రామ పంచాయతీలో 2019–20 సంవత్సరంలో 296 మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 

ఇప్పటివరకు ఒక్కరికి కూడా పూర్తిగా బిల్లులు రాలేదు. రికార్డుల్లో మాత్రం అందరికీ బిల్లులు ముట్టినట్లు నమోదు చేశారు. గ్రామ సమైక్య కమిటీ అకౌంట్​లోని డబ్బులను లబ్ధిదారులకు కాకుండా ఇతరుల అకౌంట్లకు ట్రాన్స్ఫర్​చేశారని ఆరోపించారు. పలుమార్లు అధికారులకు కంప్లైంట్​చేసినా పట్టించుకోలేదని, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఎంక్వైరీ చేయాలని కోరారు. లబ్ధిదారులకు బిల్లులు అందేలా చూడాలన్నారు. ఆయన వెంట లీడర్లు మామిడి భీమేశ్, బోయిని సాయికృష్ణ, కాసనగొట్టు వెంకన్న, మల్లేశ్, సురేశ్, సంజీవ్​తదితరులు ఉన్నారు.