రూ.10 కోట్లతో పరార్.. వారణాసిలో అరెస్ట్ 

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో  రూ.10 కోట్లతో పరారైన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. గత నెల జూన్ 8న కుంటుంబ సభ్యులతో కలిసి పరార్ అయ్యాడు కిరాణ షాప్ ఓనర్ గణేష్.  దీంతో  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ ఆధ్వరంలో రంగంలోకి దిగారు పోలీసులు. గణేష్ కోసం 20 రోజులు నుంచి విస్తృతంగా గాలించారు. వారణాసిలో గణేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయం చేయాలంటూ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్యను బాధితులు కోరారు.  బాధితులకు బయ్యారం ఆఖిలపక్ష నాయకులు అండగా నిలిచారు.