కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగుల కోసం పోరాడారు: మంత్రి శ్రీనివాస్గౌడ్

బడుగు బలహీన వర్గాల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ నిరంతరం పోరాటం చేసిన మహనీయుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు కావాలని ప్రతిపాదించిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ లోని జలదృశ్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు శ్రీనివాస్ గౌడ్.  

Also Read : హైకోర్టుకు హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని.. ఆయన ఆశయ సాధనకోసం సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  రైతు బాగు పడితే దేశం బాగుపడుతుందని ఆయన బలంగా నమ్మేవారని పేర్కొన్నారు.  
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పలువురు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా, కుల సంఘాల నేతలు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.