మహబూబాబాద్/కొత్తగూడ/జనగామఅర్బన్/ములుగు/తొర్రూరు/మరిపెడ, వెలుగు : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, ఫొటోల వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ శశాంక, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జనగామలో అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్, బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రవీందర్, ములుగులో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
అలాగే వరంగల్, కొత్తవాడ జంక్షన్ వద్ద గల కొండా లక్ష్మణ్ విగ్రహానికి వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గర్వించే గొప్పనేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.