ధర్మారెడ్డి నీ అంతు చూస్తా.. డేట్ టైం చెప్పు.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు: కొండా మురళి

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి  కాంగ్రెస్ నేత కొండా మురళీ సవాల్ విసిరారు. డేట్ టైం చెప్పు  ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాననని ఛాలెంజ్ చేశారు. ఎవరిని ఎవరు తరిమి కొడ్తారో తేల్చుకుందామన్నారు. ధర్మారెడ్డి అంతు తేలుస్తానని హెచ్చరించారు.  అహంకారపు మాటలు మానుకోకపోతే తరిమికొడతానన్నారు. పరకాలలో ఉంటా, వరంగల్ తూర్పులో ఉంటా దమ్ముంటే కాచుకో అంటూ సవాల్ చేశారు. పార్టీ అవకాశమిస్తే పరకాలలో పోటీచేస్తానన్న కొండామురళి.. మైసమ్మ సాక్షిగా ధర్మారెడ్డిని ఓడిస్తానని చెప్పారు.

బుల్లెట్లకు ఎదురొడ్డిన చరిత్ర తమదని.. కొండా మురళీ ఎప్పటికీ భయపడడని అన్నారు. ధర్మారెడ్డిది నంది పైపులు అమ్ముకుని బతికిన చరిత్ర అని.. మహిళా ఎంపీపీని అవమానించినటువంటి నీచమైన చరిత్ర అంటూ ఆరోపించారు.  ధర్మారెడ్డి అరాచకాలు భరించలేక ఆయన కార్యకర్తలు తన దగ్గరకు వస్తున్నారని అన్నారు.

కేటీఆర్ చెబితేనే ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారని .. భయపడటం తన వంశంలోనే లేదన్నారు కొండా మురలి. తాను సన్నాసుల కాళ్లు మొక్కబోనని..చెంచాగిరి అనేది బీఆర్ఎస్ పార్టీలోనే పుట్టిందన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మట్టి దొంగ అని..  వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కొవిడ్ సమయంలో చిన్న చిన్న దుకాణాల దగ్గర వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.