
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత కొండా మురళీ కౌంటర్ ఇచ్చారు. తాను రౌడీని అయితే బీఆర్ఎస్ లో చేర్చుకుని ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారని ప్రశ్నించారు. పేదలకు సేవ చేస్తే రౌడీ అనుకుంటే తనకు అభ్యంతరం లేదన్నారు. కేటీఆర్ అటు - ఇటు కాదు కాబట్టి ఆయనకు మీసాలు రావని..అందుకే తన మీసాల మీద కామెంట్ చేశారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు తన పేరు ఉచ్చరించే దమ్ములేదన్నారు కొండామురళి. తాను నియోజకవర్గంలో సరిగా తిరిగితే కేటీఆర్ కు ఉచ్చపడుతుందన్నారు.
ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నమ్మక ద్రోహి అని.. ఆయనకు టికెట్ విషయంలోనే క్లారిటీ లేదన్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు వస్తే రైతులు బట్టలు విప్పి కొడతారని హెచ్చరించారు. సిరిసిల్ల పద్మశాలీలంతా కొండా సురేఖను హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయమన్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం విజయ్ మాల్యలా పారిపోవడం ఖాయమన్నారు. చదువురాని ఎర్రబెల్లిని మంత్రిని చేసి..మేధావి అయిన కడియం శ్రీహరిని పక్కకు నెట్టేశారని ఆరోపించారు. కర్ణాటక, చత్తీస్ ఘడ్ లాగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందన్నారు.
మీసాలు మెలేసిన నాయకులు,రౌడీలు కూడా పరకాలలో పోటీ చేయాలంటే భయపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఇటీవల పరకాలల ో వ్యాఖ్యలు చేశారు. ఎవరు బెదిరించినా,చిల్లర నాయకులకు భయపడేది లేదని వ్యాఖ్యానించారు.
https://www.youtube.com/watch?v=T-k8Gmt7mhM